మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 15:48:58

విచార‌ణ‌కు చీక‌టి అడ్డు.. రాత్రంతా వేలాడుతూనే మృత‌దేహం

విచార‌ణ‌కు చీక‌టి అడ్డు.. రాత్రంతా వేలాడుతూనే మృత‌దేహం

భోపాల్ : ఓ యువ‌కుడు ఇంట్లో ఉరేసుకున్నాడు. అయితే అక్క‌డ చీక‌టిగా ఉండ‌టంతో.. యువ‌కుడు ఉరేసుకున్న గ‌దిని పోలీసులు రాత్రంతా మూసి ఉంచారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఛ‌త్తార్ పూర్ లో శ‌నివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ఛ‌త్తార్ పూర్ కు చెందిన ఓ యువ‌కుడికి.. అగ్ర కుల‌స్తుల మ‌ధ్య స్వ‌ల్ప వివాదం చోటు చేసుకుంది. అత‌న్ని దారుణంగా కొట్టారు. పంచాయ‌తీ పెద్ద‌లు అక్క‌డ ఉండి కూడా చూస్తుండిపోయారు. మొత్తానికి  అగ్ర కుల‌స్తులు ఆ యువ‌కుడికి రూ. 10 వేలు జ‌రిమానా విధించారు. దీంతో బాధితుడు తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు.  

ఇంటికొచ్చిన యువ‌కుడు త‌న గ‌దిలో ఉరేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. అప్ప‌టికే రాత్రి కావ‌డంతో.. ఉరేసుకున్న గ‌దిలో వెలుతురు లేదు. విచార‌ణ‌కు చీక‌టి అడ్డు రావ‌డంతో.. మృత‌దేహాన్ని కింద‌కు దించ‌కుండానే పోలీసులు అటునుంచి వెళ్లిపోయారు. యువ‌కుడు ఉరేసుకున్న గ‌దిని పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకుని తాళం వేశారు. ఆదివారం ఉద‌యం మ‌ళ్లీ ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకుని కేసును ద‌ర్యాప్తు చేశారు. 


logo