శనివారం 06 మార్చి 2021
Crime - Jan 15, 2021 , 21:47:38

కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్‌

కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్‌

భోపాల్‌: కామాంధులు జంతువులను కూడా వదలడం లేదు. ఒక ఆడ కుక్కపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా అతడి ఘనకార్యం బయటపడింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌ జిల్లా బరేలాకు చెందిన 54 ఏండ్ల వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోని ఒక ఆడ కుక్కపై అసహజ పద్ధతిలో లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడు. సీసీటీవీలో రికార్డైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇది జంతు ప్రేమికుల దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. తొలుత ఈ ఆరోపణలను ఖండించిన ఆ వ్యక్తికి  వీడియోను చూపించడంతో చివరకు తన తప్పును అంగీకరించాడు. దీంతో కోర్టులో ప్రవేశపెట్టగా ఆ వ్యక్తికి కస్టడీ విధించడంతో జైలుకు తరలించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo