ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jun 16, 2020 , 13:00:41

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సోమవారం రాత్రి కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ సైదులుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్‌ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కోదాడ నియోజకవర్గం రమాపురం క్రాస్‌రోడ్డులో ఉన్న చెక్‌పోస్టు వద్ద కోదాడ రూర‌ల్‌ పోలీసులు పట్టుకున్నారు.

మద్యంతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుదని ఎస్ఐ తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.logo