సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 01:36:22

రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత దుర్మరణం

దామరచర్ల: ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొన్న ప్రమాదంలోతెలుగు సినీనిర్మాతతోపాటు అతడితండ్రి దుర్మరణం చెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌ వద్ద బుధవారం చోటుచేసుకొన్నది.  నెల్లూరుకు చెందిన సినీనిర్మాత గుండాల కమలాకర్‌రెడ్డి(48) అనారోగ్యంతో ఉన్న తన తండ్రి నందగోపాల్‌రెడ్డి(74)కి మెరుగైన చికిత్సకోసం మంగళవారం రాత్రి నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో బయలుదేరారు. బుధవారం ఉదయం 6 గంటలకు కొండ్రపోల్‌ వద్ద ఆగివున్నలారీని అంబులెన్స్‌ వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కమలాకర్‌రెడ్డి, నందగోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రం గాయపడిన అంబులెన్స్‌ డ్రైవర్‌ నాగరత్నయ్యను చికిత్సకు గుంటూరు తరలించారు. కమలాకర్‌రెడ్డి  ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాను నిర్మించారు


logo