శనివారం 31 అక్టోబర్ 2020
Crime - Sep 21, 2020 , 09:02:18

తల్లీకొడుకులపై దుండగుల కాల్పులు.. తల్లి మృతి

తల్లీకొడుకులపై దుండగుల కాల్పులు.. తల్లి మృతి

గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో ఘోరం జరిగింది. బషరత్‌పూర్ ప్రాంతంలో ఆదివారం గుర్తుతెలియని దుండగులు తల్లీకొడుకులపై కాల్పులు జరపడంతో తల్లి ఘటనా స్థలంలోనే మృతి చెందగా కుమారుడిని పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం బీఆర్‌డీ మెడికల్ కళాశాలకు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకోవడానికి పోలీసుల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గోరఖ్‌పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పీ) జోగిందర్ సింగ్ తెలిపారు. ఆస్తి వివాదాలే ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.