శనివారం 28 నవంబర్ 2020
Crime - Oct 24, 2020 , 11:16:56

త‌ల్లిని న‌రికిన త‌న‌యుడు.. త‌ల‌తో ప‌రార్

త‌ల్లిని న‌రికిన త‌న‌యుడు.. త‌ల‌తో ప‌రార్

నాగర్ కర్నూల్  : మ‌ద్యం మత్తులో ఉన్న ఓ వ్య‌క్తి దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న త‌ల్లిని కిరాతకంగా న‌రికి త‌ల‌తో ప‌రారీ అయ్యాడు. ఈ దారుణ ఘ‌ట‌న‌ కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామంలో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది. పుట్ట చంద్ర‌మ్మ‌(60)కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు త‌న భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి ఉంటుండ‌గా, చిన్న కుమారుడు పుట్ట రాములు(45) భార్య‌కు దూరంగా ఉంటున్నాడు. త‌ల్లి చంద్ర‌మ్మ వ‌ద్దే రాములు ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో రాములు తాగుడుకు బానిస‌య్యాడు.


శుక్ర‌వారం రాత్రి పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన రాములు.. త‌ల్లితో గొడ‌వ ప‌డ్డాడు. మ‌ద్యానికి డబ్బులు ఇవ్వాల‌ని త‌ల్లిని డిమాండ్ చేశాడు. డ‌బ్బులు ఇచ్చేందుకు త‌ల్లి నిరాక‌రించ‌గా.. ఆవేశంతో ఆమెను కొడ‌వ‌లితో నరికి చంపాడు. ఆ త‌ర్వాత త‌ల‌ను తీసుకుని ఇంట్లోనుంచి పారిపోయాడు. స‌మాచారం అందుకున్న కొల్లాపూర్ పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. నిందితుడి ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు చేప‌ట్టారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.