గురువారం 22 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 14:29:18

16 ఏండ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసిన త‌ల్లీ కొడుకులు

16 ఏండ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసిన త‌ల్లీ కొడుకులు

న్యూఢిల్లీ: యుక్త‌వ‌య‌స్సుకు వ‌చ్చిన కొడుకు. అత‌డు త‌ప్పుదారిప‌డుతుంటే స‌రిచేయాల్సిన త‌ల్లి.. ఓ మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేయ‌డానికి స‌హ‌క‌రించింది. ఇద్ద‌రు క‌లిసి ఆ యువ‌తిని ఎత్తుకెళ్లి బంధువుల ఇంట్లో దాచిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌ల్లీకొడుకులు క‌లిసి మైన‌ర్‌ను కిడ్నాప్ చేసిన ఘ‌ట‌న పంజాబ్‌లో జ‌రిగింది. 

పంజాబ్‌లోని లూథియానా జిల్లాకు చెందిన మ‌నీషా (47), అభిషేక్‌ త‌ల్లీ కొడుకులు. 19 ఏండ్ల వ‌య‌స్సున్న అభిషేక్ గ‌త కొంత‌కాలంగా అదే గ్రామానికి చెందిన 16 ఏండ్ల బాలికను వేదిస్తున్నాడు. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 23న త‌ల్లీ కొడుకులు ఇద్ద‌రు క‌లిసి బాలిక ఇంటికివెళ్లారు. ప‌దునైన ఆయుధాల‌తో ఆమె తల్లిదండ్రుల‌ను గాయ‌ప‌రిచి, ఆ మైన‌ర్ బాలిక‌ను ఎత్తుకెళ్లారు. తీసుకెళ్లీ వారి బంధువుల ఇంట్లో దాచిపెట్టారు. 

త‌మ కూతూరుని బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్లార‌ని ఆ బాలిక త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అభిషేక్ గ‌త కొంత‌కాలంగా త‌న కూతురువెంట‌ప‌డుతున్నాడ‌ని, దీతో స్థానికులు కూడా మంద‌లించార‌ని, ఈ విష‌యం త‌మ ఇంటి చుట్టుప‌క్క‌ల వారంద‌రికీ తెలుసున‌ని అందులో పేర్కొంది. కాగా, వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు గ‌త గురువారం రాత్రి ఆ బాలిక ఆచూకీని దొర‌క‌బ‌ట్టారు. మ‌నీషా చుట్టాల ఇంట్లో బందీగా ఉన్న ఆ బాలిక‌ను విడిపించారు. త‌ప్పించుకున్న త‌ల్లీ కొడుకుల‌ను శుక్ర‌వారం రాత్రి అరెస్టు చేశారు. వారిపై కిడ్నాప్ కేసు న‌మోదుచేశారు. కాగా, కిడ్నాపుకు స‌హ‌క‌రించిన మ‌రో ఇద్ద‌రికోసం గాలిస్తున్నామ‌ని ఏఎస్ఐ ప‌ల్వింద‌ర్ సింగ్‌ తెలిపారు.  


logo