శుక్రవారం 05 మార్చి 2021
Crime - Jan 22, 2021 , 18:08:32

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?

సూర్యాపేట : అత్తతో గొడవపడి ఓ ఇల్లాలు తన పిల్లలను తీసుకొని అదృశ్యమైన ఘటన జిల్లాలోని చివ్వెంల మండలంలోని కోమటికుంటలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోగుల రాజు, శ్రీలత (27) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వెళ్లి అక్కడే ఉంటున్నాడు. కాగా, ఈ నెల 21న శ్రీలత తన భర్త వద్దకు వెళ్తాను అనడంతో అత్తతో గొడవ జరిగింది. అనంతరం తన భర్త వద్దకు వెళ్తున్నాని చెప్పి తన ఇద్దరు పిల్లలను శ్రావ్య (10), రిషికేశ్ (7) తీసుకొని ఇంటి నుంచి బయటికెళ్లింది. అయితే భర్త వద్దకు శ్రీలత వెళ్లలేదు. దీంతో బంధువులు ఎన్ని చోట్ల వెతికినా జాడ తెలియకపోడంతో  భర్త రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

కిలిమంజారోను అధిరోహించిన అన్వితా రెడ్డి

ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి

ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు 

VIDEOS

logo