సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 21, 2020 , 08:57:27

భూపాలపల్లిలో తల్లీకూతురు ఆత్మహత్య

భూపాలపల్లిలో తల్లీకూతురు ఆత్మహత్య

హైదరాబాద్‌ : కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. మహదేవ్‌పూర్ మండలం కన్నేపల్లిలో కుటుంబ కలహాలతో మనస్థాపంతో అశ్విని, ఆమె కూతురు సమత సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తల్లీకూతురు ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


logo