మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 20, 2020 , 17:24:33

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం

రోహ్తాస్ : బీహార్‌లోని రోహ్తాస్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం తల్లీకొడుకులను ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. ఇంద్రపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భట్వౌలీ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.  గ్రామానికి చెందిన దౌలత్ ఖాతూన్‌ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రహదారిని నిర్బంధించి రాస్తారోకో చేపట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రక్కులు, ట్రాక్టర్లు ఈ ప్రాంతం గుండా వేగంగా వెళ్తుండటంతో గతంలో చాలా ప్రమాదాలు జరిగాయని మండిపడ్డారు. డెహ్రీ ఎమ్మెల్యే ఫతే బహుదూర్‌ సింగ్‌ బాధిత కుటుంబానికి తక్షణసాయంగా రూ.10 వేలు అందించారు. అక్రమ ఇసుక తరలింపును వెంటనే అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo