గురువారం 21 జనవరి 2021
Crime - Dec 13, 2020 , 15:29:37

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి

రంగారెడ్డి జిల్లా : మనుమరాలిని చూసేందుకు కుమారుడితో కలిసి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి, కుమారుడు మృతి చెందిన సంఘటన జిల్లాలోని శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శంకర్‌పల్లి సీఐ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని కొండకల్‌ గ్రామానికి చెందిన శివయ్య(48) రైల్వే ఉద్యోగి. భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివయ్య చిన్న కుమార్తె నార్సింగ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులంలోని వసతి గృహంలో ఉంటూ ఇంటర్‌ మొదటి సంవత్సనం చదువుతుంది.

శనివారం ఉదయం కుమార్తెను చూసి వచ్చేందుకు తల్లి బుచ్చమ్మ(70)తో కలిసి శివయ్య తన ద్విచక్రవాహనంపై బయలుదేరి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో శనివారం రాత్రి మోకిల గ్రామ శివారుల్లోకి రాగానే  ప్రమాద వశాత్తు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్థంబానికి ఢీకొని అక్కడికి అకక్కడే మృతి చెందారు. ఈ మేరకు బంధువుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


logo