బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 13, 2020 , 09:00:06

సాగ‌ర్ రోడ్డుపై ప్ర‌మాదం.. త‌ల్లీకుమారుడు మృతి

సాగ‌ర్ రోడ్డుపై ప్ర‌మాదం.. త‌ల్లీకుమారుడు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని తుర్క‌యాంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని రాగ‌న్న‌గూడ వ‌ద్ద నాగార్జున సాగ‌ర్ ర‌హ‌దారిపై గురువారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. య‌మ‌హా ఫాసినో బైక్‌పై వెళ్తున్న త‌ల్లీకుమారుడిని వేగంగా వ‌చ్చిన కారు ఢీకొట్టింది. దీంతో త‌ల్లీకుమారుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు త‌ల్లీకుమారుడి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను రాగన్నగూడ జీవీఆర్ కాల‌నీకి చెందిన ప్రదీప్ రెడ్డి(19), చంద్రకళ(48) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు.  

ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారు నంబ‌ర్ : AP29BD7111, య‌మ‌హా ఫాసినో బైక్ నంబ‌ర్ : TS07GA2600


logo