బుధవారం 20 జనవరి 2021
Crime - Jan 03, 2021 , 16:59:13

ఘనపూర్‌లో ఘోరం.. తల్లి, కొడుకు దారుణ హత్య

ఘనపూర్‌లో ఘోరం.. తల్లి, కొడుకు దారుణ హత్య

నిజామాబాద్‌ : జిల్లాలోని చందూరు మండలం ఘనపూర్‌ వద్ద దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉమ్నాపూర్‌కు చెందిన సుజాత(30) అనే మహిళ, ఆమె ఏడాదిన్నర బాబు హత్యకు గురయ్యారు. మూడు రోజులక్రితం కట్టెల కోసమని కొడుకుని తీసుకుని మహిళ అడవికి వెళ్లింది. మహిళతో సన్నిహితంగా ఉండే రాము అనే వ్యక్తి తల్లి, కొడుకు ఇద్దరిని చంపి గొయ్యి తీసి మృతదేహాలను పూడ్చిపెట్టాడు. నిందితుడు ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భర్త వదిలేయడంతో మహిళ కొడుకుతో పాటు సొంతూరులో ఉంటుంది. గత కొంతకాలంగా మహిళతో నిందితుడు సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం.logo