ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jun 22, 2020 , 17:48:35

కొడ‌వ‌లితో ఇద్ద‌రిపై దాడి.. ఆ త‌ర్వాత అత‌ను హ‌త్య‌

కొడ‌వ‌లితో ఇద్ద‌రిపై దాడి.. ఆ త‌ర్వాత అత‌ను హ‌త్య‌

ల‌క్నో : మ‌తిస్థిమితం స‌రిగా లేని ఓ వ్య‌క్తి.. ఇద్ద‌రు యువ‌కుల‌పై కొడ‌వ‌లితో దాడి చేశాడు. ఆ త‌ర్వాత అత‌డిని.. ఓ యువ‌కుడి కుటుంబ స‌భ్యులు చుట్టుముట్టి అంత‌మొందించారు. ఈ దారుణ ఘ‌ట‌న జూన్ 18న సాయంత్రం 6:30 గంట‌ల స‌మ‌యంలో.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని షాహ‌ర‌న్ పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. 

ఇసార్ అనే వ్య‌క్తి.. గ‌త రెండు మూడు నెల‌ల నుంచి మూర్ఛ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. ఈ వ్యాధి సోకిన వారు హ‌ఠాత్తుగా స్పృహ కోల్పోయి.. ఏం చేస్తారో వారికే తెలియ‌దు. అయితే ఇమ్లియా గ్రామానికి చెందిన ఓ యువ‌కుడిపై కొడ‌వ‌లితో దాడి చేశాడు. ఆ త‌ర్వాత అత‌న్ని బైక్ తీసుకుని అక్క‌డ్నుంచి ఇసార్ పారిపోయాడు. ఈ గ్రామానికి 4 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న డెహ్రా గ్రామానికి ఇసార్ చేరుకున్నాడు. అక్క‌డ కూడా మ‌రో బాలుడిపై కొడ‌వ‌లితో దాడి చేశాడు. అత‌ని మెడ‌పై రెండు సార్లు బ‌లంగా న‌ర‌క‌డంతో కుప్ప‌కూలిపోయాడు. 

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన బాధితుడి కుటుంబ స‌భ్యులు.. ఇసార్ ను చుట్టుముట్టారు. చెట్టుకు క‌ట్టేసి క‌ర్ర‌లు, ఇనుప రాడ్ల‌తో చిత‌క‌బాదారు. తీవ్ర గాయాల‌పాలైన అత‌ను ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయాడు. ప్రాణాలు కోల్పోయాడు. 

విష‌యం తెలుసుకున్న ఇసార్ సోద‌రుడు డెహ్రా గ్రామానికి చేరుకున్నాడు. అత‌డిని ఏం చేయొద్ద‌ని బ‌తిమాలాడు. అయిన‌ప్ప‌టికీ వారు వినిపించుకోలేదు. చివ‌ర‌కు ఇసార్ ప్రాణాలు తీశారు. 

ఇసార్ సోద‌రుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇసార్ ను హ‌త్యలో 11 మందిని నిందితులుగా చేర్చారు. యువ‌కుడి కుటుంబ స‌భ్యులు కూడా ఫిర్యాదు చేయ‌డంతో.. ఇసార్ కుటుంబ స‌భ్యుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.


logo