మంగళవారం 19 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 18:47:52

అదృశ్యమైన వ్యక్తి డంపింగ్‌ యార్డులో శవమై కనిపించాడు..

అదృశ్యమైన వ్యక్తి డంపింగ్‌ యార్డులో శవమై కనిపించాడు..

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌ డంపింగ్‌ యార్డులో వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. దుండుగులు హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని మియాపూర్‌కు చెందిన రామకృష్ణగా గుర్తించారు. మియాపూర్‌కు చెందిన రామకృష్ణ (40) స్థానికంగా ప్రైవేట్‌ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు.

కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇండ్లలో, బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో మియాపూర్‌ పోలీసులను ఆశ్రయించడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం కైత్లాపూర్‌ డంపింగ్‌ యార్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడిని రామకృష్ణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.