బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 02, 2020 , 20:13:22

ఏడేళ్ల బాలిక‌పై అత్యాచారం.. ఆపై హ‌త్య‌

ఏడేళ్ల బాలిక‌పై అత్యాచారం.. ఆపై హ‌త్య‌

చెన్నై : ముక్కుప‌చ్చ‌లార‌ని ఓ బాలిక‌పై కామాంధులు క‌న్నేశారు. ఆ చిన్నారిని బ‌ల‌వంతంగా అప‌హ‌రించి.. అత్యాచారం చేశారు. అంత‌టితో ఆగ‌ని రాక్ష‌స మూక‌లు.. ఆమెను హ‌త్య చేసి చెట్ల పొద‌ల్లో ప‌డేశారు. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని పుదుకొట్టైలో చోటు చేసుకుంది. 

జూన్ 30వ తేదీన ఓ ఏడేళ్ల బాలిక‌.. తన ఇంటి ముందు ఆడుకుంటున్న‌ది. అంత‌లోనే అదృశ్య‌మైంది. ఆ అమ్మాయి కోసం కుటుంబ స‌భ్యులు, బంధువులు వెతికారు. కానీ బాలిక జాడ ఆరోజు దొర‌క‌లేదు. జులై 1వ తేదీన బాలిక మృత‌దేహం.. గ్రామానికి స‌మీపంలో ఉన్న ఓ చెట్ల పొదల్లో ల‌భ్య‌మైంది.  

దీంతో బాధిత కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక బ‌ట్ట‌లు చిరిగిపోయాయి. ఆమెపై అత్యాచారం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ త‌ర్వాత గొంతు నులిమి చంపిన ఆన‌వాళ్లు ఉన్నాయి. 

ఈ కేసులో ఓ 25 ఏళ్ల యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మ‌రో యువ‌కుడు ప‌రారీలో ఉన్నాడు. నిందితుడు చేసిన నేరాన్ని అంగీక‌రించాడు.


logo