మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 19:57:14

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5బీ గనిలో మిస్ ఫైరింగ్..కార్మికులకు గాయాలు

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5బీ గనిలో మిస్ ఫైరింగ్..కార్మికులకు గాయాలు

మంచిర్యాల : జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5బీ బొగ్గు గనిలో మిస్ ఫైరింగ్ తో పైకప్పు కూలి ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కోల్ కట్టర్లు గాదె శివయ్య, రత్నం లింగయ్య, పల్లె రాజయ్య, బదిలీ వర్కర్ సీ హెచ్ సుమన్ కుమార్  గాయపడ్డారు. బుధవారం సెకండ్ షిఫ్ట్ లో సాయంత్రం సుమారు 6.00 గంటల సమయంలో.. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే5బీ గనిలో 4 సీమ్ 2 డీప్ 36 1/2 లెవల్ లో బ్లాస్టింగ్ కోసం హొల్స్ వేస్తుండగా మిస్ ఫైర్ అయింది.

వీరిని రామకృష్ణాపుర్ ఏరియా దవాఖానకి తరలించారు. గాయాలైన కార్మికులను టీబీజీకేఎస్ చర్చల కమిటీ ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.తాజావార్తలు


logo