శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 11:41:58

కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మిస్ ఫైర్..ఆర్ఎస్ఐ మృతి

కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మిస్ ఫైర్..ఆర్ఎస్ఐ మృతి

భద్రాద్రి కొత్తగూడెం : విధి నిర్వహణలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తు చేతిలోని ఆయుధం మిస్ ఫైర్ కావడంతో ఆర్ఎస్ఐ మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఆర్ఎస్ఐ ఆదిత్య సాయికుమార్ చేతిలోని ఆయుధం మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా దవాఖానకి తరలించారు.


logo