బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 14:31:56

గ్యాస్ క‌ట్ట‌ర్‌తో ఏటీఎం చోరీకి విఫ‌ల‌య‌త్నం

గ్యాస్ క‌ట్ట‌ర్‌తో ఏటీఎం చోరీకి విఫ‌ల‌య‌త్నం

సంగారెడ్డి : హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంను కొల్ల‌గొట్టేందుకు దుండ‌గులు తీవ్ర ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంఘ‌ట‌న‌ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి కిష్టారెడ్డిపేట‌లో బుధ‌వారం అర్థ‌రాత్రి చోటుచేసుకుంది. మాస్కులు ధరించిన కొంద‌రు దుండ‌గులు గ‌డిచిన రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఏటీఎంలోకి ప్ర‌వేశించారు. గ్యాస్ క‌ట్ట‌ర్‌ను ఉప‌యోగించి గంట‌పాటు తీవ్రంగా శ్ర‌మించి ఏటీఎంను తెరిచేందుకు శ్ర‌మించారు. వీరి ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వ‌డంతో అక్క‌డినుంచి వెనుతిరిగారు. ఈ త‌తంగ‌మంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా వాహ‌నం నెంబ‌ర్‌ను గుర్తించిన పోలీసులు నిందితుల ఆచూకీకి చ‌ర్య‌లు చేప‌ట్టారు. logo