గురువారం 28 జనవరి 2021
Crime - Oct 03, 2020 , 18:10:11

ప్రియుడితో క‌లిసి చెల్లిని చంపిన బాలిక‌

ప్రియుడితో క‌లిసి చెల్లిని చంపిన బాలిక‌

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మిర్జాపూర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ యువ‌కుడితో త‌నకు గ‌ల సంబంధాన్ని అడ్డగిస్తున్న‌ద‌న్న కార‌ణంతో 15 ఏండ్ల బాలిక త‌న ప‌దేండ్ల చెల్లిని చంపుకున్న‌ది. త‌న ప్రియుడి సాయంతో నిందితురాలు ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. బాలికను హ‌త్య చేసిన త‌ర్వాత నిందితులిద్ద‌రూ ఆమె మృత‌దేహాన్ని రైలు ప‌ట్టాల ప‌క్క‌న పడేసి బైక్‌పై ప‌రార‌య్యారు. మిర్జాపూర్‌లోని బ‌రూహియా గ్రామంలో అక్టోబ‌ర్ 1న ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

అయితే, అదే రోజు సాయంత్రం బాలిక‌ల తండ్రి త‌న ఇద్ద‌రు కూతుళ్లు క‌నిపించ‌డం లేద‌ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు గాలింపు చేప‌ట్టారు. శుక్ర‌వారం రైలు ప‌ట్టాల ప‌క్క‌న‌ బాధితుడి చిన్న కూతురు నందిని (10) మృత‌దేహాన్ని గుర్తించారు. అనంత‌రం పెద్ద కూతురు అంజ‌లి (15) కోసం గాలించ‌గా త‌న బాయ్‌ఫ్రెండ్‌తో ప‌ట్టుబ‌డింది. అనుమానించిన పోలీసులు గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డంతో ఇద్ద‌రు క‌లిసి నందినిని హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo