మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 16:23:23

ఉరి వేసుకొని మైన‌ర్ ఆత్మ‌హ‌త్య‌.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మా?

ఉరి వేసుకొని మైన‌ర్ ఆత్మ‌హ‌త్య‌.. ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మా?

నోయిడా : 16 ఏళ్ల బాలిక శనివారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఉత్తర ప్రదేశ్ రాష్ర్టం నోయిడాలో చోటు చేసుకుంది. 

కొండ్లి ప్రాంతానికి చెందిన బాలిక శ‌నివారం రాత్రి 7.30 గంట‌ల స‌మ‌యంలో గ‌దిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించి ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. చ‌నిపోవ‌డానికి ముందు బాలిక గంట‌ల త‌ర‌బ‌డి ఫోన్‌లో ఎవ‌రితోనే మాట్లాడింద‌ని తెలుసుకున్న పోలీసులు.. ప్రేమ వ్య‌వ‌హార‌మే ఆమె చావుకు కార‌ణమా.. లేక మ‌రేదైనా ఉంటుందా? అనే కోణంలో విచారిస్తున్నారు. ‌మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించి.. త‌దుప‌రి ద‌ర్యాప్తు చేప‌డుతున్నామ‌ని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo