శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 03, 2020 , 13:16:35

బాలికపై లైంగిక దాడి.. వీడియో తీసి బెదిరింపులు

బాలికపై లైంగిక దాడి.. వీడియో తీసి బెదిరింపులు

రాజ్‌కోట్‌ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు స్నేహితుడి సాయంతో ఆ తతంగాన్ని వీడియో తీసి బెదిరించాడు. సోమ్‌నాథ్‌ జిల్లా  కోడినార్‌ తాలూకాలో ఈ ఘటన జరిగింది. మల్ష్రామ్‌ గ్రామానికి చెందిన హితేశ్‌ సోలంకి (22) అనే యువకుడు స్థానికంగా 16 ఏండ్ల బాలికను అపహరించి శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ఒడిగట్టాడు. వ్యవహారాన్ని తన స్నేహితుడు ప్రకాశ్‌ మొరాసియా సాయంతో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెడతానంటూ బాధితురాలిని బెదిరించాడు. గత నెల 21న ఆమెను మరోమారు బెదిరించి శిథిలావస్థలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు. బాలికకు వివరీతమైన కడుపు నొప్పి రావడంతో విషయం తల్లికి చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడని అదుపులోకి తీసుకున్నామని కోడినార్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.