సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 11:19:35

16 ఏండ్ల బాలికపై రేప్‌.. ఇద్దరు రైల్వే పోలీసుల అరెస్ట్‌

16 ఏండ్ల బాలికపై రేప్‌.. ఇద్దరు రైల్వే పోలీసుల అరెస్ట్‌

న్యూఢిల్లీ: మైనర్‌ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ ఇద్దరు రైల్వే పోలీసులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన 16 ఏండ్ల బాలిక గత తొమ్మిదేండ్లుగా న్యూఢిల్లీలోని ప్రీత్‌ విహార్‌లో పనిచేస్తున్నది. జూన్‌ 12న స్వస్థలానికి వెళ్లేందుకు తన యజమానికి సమాచారం ఇవ్వకుండా ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అయితే అక్కడి నుంచి రైళ్లు నడుస్తలేవని తెలుసుకుని, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నది. అక్కడ పనిచేస్తున్న ఆర్పీఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ పోలీసును జార్ఖండ్‌ రైలు గురించి వాకబు చేసింది. తాను రాంచీ రైలు ఎక్కిస్తానని చెప్పిన ఆ నిందితుడు బాలికను ఓ గదిలోకి తీసుకువెళ్లాడు. ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి, లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత గేటు వద్ద కాపలాగా ఉన్న మరో పోలీసు కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు.


logo