శనివారం 05 డిసెంబర్ 2020
Crime - Oct 11, 2020 , 12:12:56

బాలికపై లైంగికదాడి.. నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం

బాలికపై లైంగికదాడి.. నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం

రేవా : మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. లైంగికదాడికి గురైన బాలిక నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించింది. రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అట్రాయిలా ప్రాంతానికి చెందిన బాలిక అదేప్రాంతానికి చెందిన బాలుడు కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నారు. ఈ నెల 7న ఇద్దరూ ఏకాంత ప్రదేశానికి వెళ్లగా బాలుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక ఇంటికి వచ్చి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిని అదుపులోకి తీసుకొని జ్యువనైల్‌ కోర్టులో హాజరుపర్చారు. బాధితురాలిపై లైంగికదాడి జరిగినట్లు వైద్య నివేదికలో స్పష్టమైందని దబోరా సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారి బీపీ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె దవాఖానలో చికిత్స పొందుతోందని పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.   


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.