మంగళవారం 19 జనవరి 2021
Crime - Jan 13, 2021 , 09:49:43

స్నేహితుల‌తో క‌లిసి ప్రియురాలిపై సామూహిక‌ అత్యాచారం..!

స్నేహితుల‌తో క‌లిసి ప్రియురాలిపై సామూహిక‌ అత్యాచారం..!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అత్యాచారాల ప‌రంప‌ర కొనసాగుతూనే ఉన్న‌ది. నిత్యం ఆ రాష్ట్రంలో ఎక్క‌డో ఒక‌చోట అత్యాచారాలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా బ‌రేలీ జిల్లాలో ఓ మైన‌ర్ బాలిక‌పై ఆమె ప్రియుడు, అత‌డి న‌లుగురు స్నేహితులు క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంత‌టితో ఆగ‌క ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైర‌ల్ కావ‌డంతో బాధితురాలి కుటుంబ‌స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు. 

బ‌రేలీ ఏఎస్పీ స‌త్యనారాయ‌ణ్ తెలిపిన వివరాల ప్ర‌కారం.. జిల్లాకు చెందిన‌ ఓ యువ‌కుడు ప్రేమ పేరుతో మైన‌ర్ బాలిక‌ను లోబ‌ర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ ఏకాంతంగా గ‌డిపిన ప‌లు వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. తాజాగా ఆ ఫొటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతానంటూ బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. 

ఇటీవ‌ల త‌న న‌లుగురు స్నేహితుల‌ను తీసుకొచ్చి వాళ్ల‌తో శృంగారంలో పాల్గొనాల‌ని బ‌ల‌వంత‌పెట్టాడు. అందుకు బాలిక ఒప్పుకోక‌పోవ‌డంతో త‌న‌తో ఏకాంతంగా గ‌డిపిన వీడియోల‌ను సోష‌ల్ మీడ‌యాలో వైర‌ల్ చేస్తాన‌ని బెదిరించాడు. దాంతో భ‌య‌ప‌డిపోయిన బాలిక‌పై ఐదుగురూ క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా మ‌రిన్ని వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. 

ఆ వీడియోలు, ఫొటోల‌ను ఆస‌రాగా తీసుకుని మ‌రోసారి సామూహిక అత్యాచారానికి య‌త్నించారు. కానీ అందుకు ఆమె అంగీక‌రించక‌పోవడంతో ఎప్ప‌టిలాగే బెదిరించారు. అయినా బెద‌ర‌క‌పోవ‌డంతో క‌క్షగ‌ట్టిన నిందితులు ఈ జ‌న‌వ‌రి 1న ఆ వీడియోలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైర‌ల్‌గా మార‌డంతో కుటుంబ‌స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.