ఆదివారం 25 అక్టోబర్ 2020
Crime - Oct 01, 2020 , 10:06:54

మధ్యప్రదేశ్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి

మధ్యప్రదేశ్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి

ఖర్గోన్‌ : దేశంలో మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట మృగాళ్ల అకృత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లా కేంద్రంలో బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఖర్గోస్‌ శివారులో మైనర్‌ బాలిక తన అన్నతో కలిసి గుడిసెలో నివాసం ఉంటుంది.

రాత్రి ముగ్గురు దుండుగులు బాలిక అన్నపై దాడి చేసి ఆమెను సమీపంలోని పొలాల్లోకి లాకెళ్లి సామూహిక లైంగిక దాడి చేశారు. అపస్మారస్థితికి చేరిన ఆమెను రోడ్డువెంట పడేసి వెళ్లిపోయారు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్పీ శైలేంద్ర సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo