ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 27, 2020 , 16:35:46

అత్యాచార బాధితురాలు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. చెట్టుకు వేలాడుతూ తండ్రి

అత్యాచార బాధితురాలు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. చెట్టుకు వేలాడుతూ తండ్రి

జైపూర్ : ఓ మైన‌ర్ పై ప‌దేప‌దే అత్యాచారం చేశారు. తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాలిక ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. తండ్రేమో చెట్టుకు వేలాడుతూ క‌నిపించాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ అల్వార్ జిల్లాలోని రామ్ గ‌ర్హ్ ఏరియాలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. 

రామ్ గ‌ర్హ్ కు చెందిన మైన‌ర్ ను.. అనీస్ అనే వ్య‌క్తి లోబ‌ర్చుకున్నాడు. ఆమెపై అనేక సార్లు అత్యాచారం చేశాడు. మ‌రో ఇద్ద‌రు యువ‌కులు వేధింపుల‌కు గురి చేశారు ఆమెను. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాలిక‌.. జూన్ 18న స‌మీపంలోని బావిలో దూకింది. గ‌మ‌నించిన స్థానికులు ఆమెను ప్రాణాల‌తో కాపాడారు. ఈ కేసులు అనీస్ తో పాటు మ‌రో ఇద్ద‌రు యువ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే బాధితురాలి తండ్రి శుక్ర‌వారం త‌న ఇంటికి స‌మీపంలోని చెట్టుకు వేలాడుతూ క‌నిపించాడు. అత‌నే ఉరేసుకున్నాడా? లేక ఎవ‌రైనా హ‌త్య చేశారా? అన్న‌ది తేలాల్సి ఉంది. అనీస్ అత‌డిని చంపి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీకరించి ఉంటాడ‌ని స్థానికులు భావిస్తున్నారు.

నిందితుడిపై కేసు న‌మోదు చేసి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేయాల‌ని ఓ స్వ‌చ్ఛంద సంస్థ డిమాండ్ చేసింది. నిందితుడిని చంపేయాల‌ని సంస్థ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. 


logo