వ్యభిచారం చేయాలంటూ మైనర్‌పై సోదరి, తల్లి ఒత్తిడి

భోపాల్: తోడుగా ఉండి మంచి చెడులు చూడాల్సిన తల్లి, తోబుట్టువు.. మైనర్‌ను వ్యభిచారం చేయాలంటూ డ్రగ్స్‌కు అలవాటు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. తాను ఆపనులు చేయనంటే కొట్టి మరీ హింసిస్తున్నారు. చివరకు చేసేదేం లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సోదరితోపాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజలుగా 20 ఏండ్ల బాలిక వ్యభిచారం చేస్తున్నది. తన సోదరియైన 13 ఏండ్ల బాలికను కూడా వ్యభిచార వృత్తిలోకి దింపి ఎక్కువ మొత్తంలో సంపాదించాలని ఆశపడిన అక్క.. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసింది. మత్తులో ఉన్న సమయంలో పలువురి వద్దకు పంపింది. అయితే, మత్తుదిగిన తర్వాత విషయం తెలుసుకున్న బాలిక.. అక్కను నిలదీయడంతోపాటు ఈ వృత్తి చేపట్టలేనంటూ తేల్చిచెప్పింది. దాంతో అక్కతోపాటు ఆమెకు వత్తాసు పలికిన తల్లి కూడా బాలికను హింసకు గురిచేయడమే కాకుండా వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడితీసుకువచ్చింది. మత్తుమందు వాడకం నుంచి బయటపడేందుకు సంప్రదించిన ఎన్జీవో సహాయంతో బాలిక పోలీసులను సంప్రదించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇండోర్‌లో మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన మరోఐదుగురిని, బాలిక సోదరిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు రూ.10కోట్లు చెల్లిస్తారు!
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్..
- అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!
- ‘కిసాన్ ర్యాలీలో అసాంఘిక శక్తులు’
- ఎర్రకోట ఘటనను ఖండించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి