కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం

బరేలీ : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డువెంట నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రేమ్‌చంద్ అగర్వాల్ అనే వ్యక్తి భార్య, కుమారుడు, అల్లుడుతో కలిసి కారులో లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లా నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. షాజహాన్‌పూర్ జిల్లా నవాబ్పూర్ గ్రామ సమీపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి ముగ్గురు పాదాచారులను ఢీకొట్టింది. ప్రమాదంలో ఈశ్వర్ ప్రసాద్ (45), రజినీశ్ (12) ఘటనా స్థలంలోనే మృతి చెందగా గుడ్డు(24) అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం షాజహాన్‌పూర్ దవాఖానకు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వాట్సాప్‌కు భారత ప్రభుత్వం వార్నింగ్
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్‌షిప్‌లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..