రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు

మేడ్చల్ : జిల్లాలోని కీసరలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రీడ్జ్ రిసార్టులోని ఓ విల్లాలో బెస్ట్ క్రాప్ విత్తన సంస్థ మేనేజర్ ఆదివారం రాత్రి సన్నిహితుల కోసం రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించి ఆరుగురు యువతులను, 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్లు రేపు పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
వ్యాపారాన్ని పెంచుకునేందుకు సంస్థ మేనేజర్ ఇలా అమ్మాయిలను తీసుకొచ్చి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. సీడ్స్ కంపెనీ మేనేజర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరి సెల్ఫోన్లు, వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరందరిని కోర్టులో హాజరుపరుస్తామని కీసర సీఐ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
- టీకాకు సన్నద్ధం
- వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి
- లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్ర్తాలు
- హెచ్‌సీఎల్‌లో 20 వేల ఉద్యోగాలు
- హైదరాబాద్-షికాగో నాన్‌స్టాప్