గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 17:52:08

ఆక‌లితో కొడుకు మృతి.. మూడురోజుల పాటు త‌ల్లి..

ఆక‌లితో కొడుకు మృతి.. మూడురోజుల పాటు త‌ల్లి..

చెన్నై :  ఓ ఏడేళ్ల బాలుడు ఆక‌లితో అల‌మ‌టించి క‌న్నుమూశాడు. మ‌తిస్థిమితం స‌రిగా లేని ఆ బాలుడి త‌ల్లి.. కొడుకు మృత‌దేహం వ‌ద్ద మూడు రోజుల పాటు అలానే ఉండిపోయింది. ఆ శ‌వాన్ని చీమ‌లు పీక్క‌తిన‌కుండా కంటికి రెప్ప‌లా కాపాడుకుంది ఆ త‌ల్లి. ఈ విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని తిరుణింద్ర‌వూరులో సోమ‌వారం ఉద‌యం వెలుగు చూసింది.

తిరుణింద్ర‌వూరుకు చెందిన స‌రస్వ‌తి, జోష్ దంప‌తులు ఏడేళ్ల క్రితం విడిపోయారు. స‌ర‌స్వ‌తికి ఏడేళ్ల కుమారుడు శ్యామూల్ ఉన్నాడు. అయితే స‌ర‌స్వ‌తి గ‌త కొన్ని నెల‌ల నుంచి మాన‌సికంగా బాధ‌ప‌డుతోంది. వీరిని చూసుకునే వారు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో.. తిండికి క‌ష్ట‌మైంది. శ్యామూల్ ఆక‌లితో అల‌మ‌టించి మూడు రోజుల క్రితం చ‌నిపోయాడు. మ‌తిస్థిమితం స‌రిగా లేని త‌ల్లి.. కుమారుడి మృత‌దేహం వ‌ద్ద మూడు రోజుల పాటు ఉండిపోయింది. ఇంట్లో నుంచి దుర్వాస‌న రావ‌డంతో పొరుగింటి వారి ఫిర్యాదుతో పోలీసులు సోమ‌వారం ఉద‌యం ఆ ఇంటిని తెరిచి చూడ‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది. బాలుడిని చీమ‌లు తిన‌కుండా.. ఆ త‌ల్లి బ‌ట్ట‌తో ఎప్ప‌టిక‌ప్పుడు శ‌రీరాన్ని శుభ్రం చేసింది. ఈ విష‌యాల‌న్ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డి అయ్యాయి.  శ్యామూల్ ఆక‌లితోనే చ‌నిపోయిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు.  

గ‌త నాలుగు నెల‌ల క్రితం స‌ర‌స్వ‌తి, శ్యామూల్ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోవ‌డంతో.. వారి బంధువులు రూ. 1.5 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి వైద్యం చేయించారు. ఆ త‌ర్వాత బంధువుల‌కు త‌ల్లీకుమారుడు దూరంగా ఉంటున్నారు. భ‌ర్త‌తో విడిపోయిన త‌ర్వాతే స‌ర‌స్వ‌తి మ‌తిస్థిమితం కోల్పోయింద‌ని బంధువులు తెలిపారు.


logo