బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 20, 2020 , 15:35:00

వ్యాపారి హత్య కోసం వచ్చి ఇద్దరు మహిళలపై లైంగికదాడి

వ్యాపారి హత్య కోసం వచ్చి ఇద్దరు మహిళలపై లైంగికదాడి

జైపూర్‌: ఒక వ్యాపారిని హత్య చేసేందుకు వచ్చిన కిరాయి గూండాలు ఇద్దరు మహిళలపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని నీమ్రానాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. నీమ్రానాకు చెందిన ఒక వ్యాపారిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన  ఐదుగురు వ్యక్తులు ఈ నెల 17న స్థానిక త్రీస్టార్‌ హోటల్‌లో దిగారు. హోటల్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేసి తమకు సెక్స్ వర్కర్స్ కావాలని చెప్పారు. ఇంతలో వారిలోని ఇద్దరు వ్యక్తులు ఆ హోటల్‌లో పని చేసే మహిళా ఉద్యోగినిల గదిలోకి చొరబడ్డారు. తుపాకులతో వారిని బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. 

ఈ విషయం తెలిసిన హోటల్‌ మేనేజర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే ఆ హోటల్‌కు వచ్చి ఇద్దరు బాధిత మహిళలను కాపాడారు. ఐదుగురు నిందితుల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్‌ చేశారు. సామూహిక లైంగికదాడి, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, హత్యకు కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo