తమిళ డైరెక్టర్ శంకర్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తన పెద్ద కూతురు ఐశ్వర్యకు త్వరలోనే పెళ్లి చేయబోతున్నాడు. ఈయనకు కాబోయే అల్లుడు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శంకర్ కూతురు ఐశ్వర్య ఒక డాక్టర్.. కాగా ఆమెకు కాబోయే భర్త ఒక క్రికెటర్ కావడం గమనార్హం. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో స్టార్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోదరన్‌కు తన పెద్ద కూతురు ఐశ్వర్యను ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు డైరెక్టర్ శంకర్.
రోహిత్ తండ్రి తమిళనాట ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు ఉంది. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా మహాబలిపురంలో వీరి వివాహాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో పాటు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందర్నీ పిలిచి పెద్ద పార్టీ చేయాలని భావిస్తున్నాడు శంకర్. త్వరలోనే కూతురు పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను శంకర్ మీడియాకు తెలియజేయనున్నారు.
డైరెక్టర్ శంకర్ తల్లి ముత్తులక్ష్మి రెండు నెలల కింద అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా శంకర్‌కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్ చదువుకుంటున్నాడు. కూతుళ్లు ఐశ్వర్య, అదితి. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అలాగే దిల్ రాజు నిర్మాణంలో రామ్‌చరణ్‌తో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా మరో సినిమా కూడా చేయబోతున్నాడు శంకర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
చిరంజీవి సినిమాపై ఈ కన్ఫ్యూజన్ ఇంకెన్ని రోజులో.. ?
మాస్ట్రో : ఓటీటీలో నితిన్ సినిమా ?
19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే