సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 05, 2020 , 11:01:46

బేగంపేటలో మెడికల్‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్య

బేగంపేటలో మెడికల్‌ స్టూడెంట్‌‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బేగంపేటలో విషాదం చోటుచేసుకున్నది. గాంధీ దవాఖానలో మెడిసిన్‌ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. గాంధీ దవాఖానలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ఝాన్సీ.. బేగంపేటలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఝాన్సీ ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదుచేశారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఆమె స్వస్థలం మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌.


logo