శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 17, 2020 , 18:14:19

నగరంలో డ్రగ్స్ పట్టివేత.. ప‌బ్ మేనేజర్ అరెస్టు

నగరంలో డ్రగ్స్ పట్టివేత.. ప‌బ్ మేనేజర్ అరెస్టు

హైద‌రాబాద్ : పెద్ద ఎత్తున డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకున్న పోలీసులు ఓ ప‌బ్ మేనేజ‌ర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. గోవా నుంచి హైద‌రాబాద్‌కు ఎండీఎంఏ(మిథైల్ ఎనిడియోక్సి మెథాంఫేటమిన్) డ్రగ్‌ను తీసుకువ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను న‌గ‌రంలోని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప‌ట్టుకున్నారు. నిందితుల‌ను అహ్మ‌ద్‌, స‌ల్మాన్‌గా గుర్తించారు. వీరి వ‌ద్ద నుంచి 200 గ్రాముల మ‌త్తుప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. స‌ల్మాన్ న‌గ‌రంలోని ప్ర‌ముఖ ప‌బ్‌లో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. సల్మాన్ ద్వారా మ‌రో పది పబ్‌ల‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు సమాచారం. సల్మాన్ సరఫరా చేస్తున్న పబ్స్ డాటాను పోలీసులు బయటకు  తీస్తున్నారు. మరొకవైపు ఈశాన్య రాష్ట్రాలతో పాటు గోవా నుంచి అమ్మాయిలను రప్పిస్తూ వారితో వ్య‌భిచారానికి పాల్ప‌డుతున్న‌ట్లుగా స‌మాచారం. 


logo