ముంబై, మే 13: గోఎయిర్ పేరు మారింది. 15 ఏండ్లుగా విమాన సేవలు అందిస్తున్న గోఎయిర్..ప్రస్తుతం గోఫస్ట్గా మార్చుకున్నది. తక్కువ చార్జీకే సేవలు అందించాలనే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.మరోవైపు, వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులను షేర్లను విక్రయించడం ద్వారా సేకరించాలనుకుంటున్నది.