ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 19, 2020 , 14:39:48

బ్రౌన్‌ షుగర్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న ఎంబీఏ స్టూడెంట్‌ అరెస్టు

బ్రౌన్‌ షుగర్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న ఎంబీఏ స్టూడెంట్‌ అరెస్టు

భువనేశ్వర్ : ఒడిశా రాష్ర్టంలోని బాలసోర్‌లో బ్రౌన్‌ షుగర్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న ఎంబీఏ స్టూడెంట్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బాలాసోర్‌ జిల్లాలోని బంకా ఖాజురి ప్రాంతానికి చెందిన ఎంబీఏ విద్యార్థి ఎస్‌కే రియాజుద్దీన్‌ బ్రౌన్‌ షుగర్‌ను తరలించడం కోసం జిల్లా కేంద్ర బస్‌స్టాండ్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో రియాజ్‌ను తనిఖీ చేయగా అతడి వద్ద 1.3కిలోల బ్రౌన్‌ షుగర్‌ దొరికినట్లు తెలిపారు. వెంటనే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌టీఎఫ్ డీఐజీ జేఎన్‌ పంకజ్ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo