బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 23, 2020 , 18:17:57

వరంగల్‌ నగరంలో భారీ చోరీ..

వరంగల్‌ నగరంలో భారీ చోరీ..

వరంగల్ అర్బన్‌ : వరంగల్‌ నగరంలోని ఎల్లమ్మ బజార్‌లో భారీ చోరీ జరిగింది. మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ టీ గణేశ్‌ కథనం ప్రకారం.. బెంగాల్‌కు చెందిన బంగారు నగలు తయారుచేసే వ్యాపారి దీపాంకర్‌ చక్రబర్తి 25 సంవత్సరాలుగా వరంగల్‌ నగరంలో ఆర్డర్లపై బంగారు ఆభరణాలను తయారు చేస్తున్నాడు. బెంగాల్‌కు చెందిన వర్కర్లు అందులో నివాసముంటుండగా, బీరువా, లాకర్‌కు మాత్రమే తాళాలు వేసుకుని వ్యాపారి వెళ్లేవాడు. 

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వెళ్లి శనివారం ఉదయం వచ్చి చూసేసరికి షాపునకు తాళం వేసి ఉంది. అనుమానం వచ్చిన దీపాంకర్‌ దుకాణం తాళం పగులగొట్టి చూసేసరికి బీరువా, లాకర్‌ తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న సుమారు 70 తులాల బంగారం కనిపించలేదు. ఈ క్రమంలో వర్కర్స్‌కు సంబంధించిన వారికి సమాచారం చేరవేసి శుక్రవారం, శనివారం వెతికినప్పటికీ ఎలాంటి ఆచూకీ దొరుకలేదు. దీంతో దీపాంకర్‌ ఆదివారం రాత్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గణశ్‌ తెలిపారు. 


logo