గురువారం 03 డిసెంబర్ 2020
Crime - Oct 13, 2020 , 17:09:41

వికారాబాద్‌ పట్టణంలో భారీ చోరీ

వికారాబాద్‌ పట్టణంలో భారీ చోరీ

వికారాబాద్‌ : జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని ఓ ఇంట్లో 20 తులాల బంగారం, లక్ష నగదు అపహరించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ధారూరు మండలం మోమిన్‌కలాన్‌ గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి వికారాబాద్‌ పట్టణంలోని ఇసాఖాన్‌బాగ్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే రెండు రోజుల క్రితం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులతో బంధువుల దగ్గరికి వెళ్లాడు.  

సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న అల్మారా పగులగొట్టి 20 తులాల బంగారం, లక్ష నగదును దొంగలించారు. మంగళవారం ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.