మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 24, 2020 , 14:35:21

విజయవాడలో భారీ చోరీ

విజయవాడలో భారీ చోరీ

అమరావతి: విజయవాడలో భారీ చోరీ జరిగింది.పట్టపగలే చోరీకి పాల్పడడం సంచలనం కలిగించింది. నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఉన్న సాయి జువెల్లరీ దుకాణం వద్ద గుమాస్తా కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. ఏడు కిలోల బంగారంతో పాటు 30లక్షల రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు.

విషయం తెలుసుకున్న నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, క్లూస్‌ టీం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo