మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 14, 2020 , 16:58:05

రిలయన్స్‌ డిజిటల్‌లో భారీ చోరీ..

రిలయన్స్‌ డిజిటల్‌లో భారీ చోరీ..

హైదరాబాద్‌: నగర శివారు మియాపూర్‌ ఠాణా పరిధిలోని మదీనాగూడ రిలయన్స్‌ డిజిటల్‌ షోరూంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయని సమాచారం. శనివారం ఉదయం సిబ్బంది షోరూంను తెరిచి చూడగా సెల్‌ఫోన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటంతో గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి వెంట ఉన్న దుకాణంలో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీపావళి పర్వదినాన గిరాకీ అధికంగా ఉన్నా చోరీ నేపథ్యంలో యాజమాన్యం దుకాణాన్ని మూసివేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.