శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 28, 2021 , 08:20:28

భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

ముంబై: మహారాష్ట్రలోని భీవండీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భీవండీలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎండీఐసీ)కు చెందిన పారిశ్రామిక వాడలో ఉన్న ఓ గోదామ్‌లో ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో అవి క్రమంగా గోదామ్‌ మొత్తానికి విస్తరించాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది. 

గతవారం పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిర్మాణంలో ఉన్న ఐదంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం కోసం నిర్మిస్తున్న ఆ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. 


VIDEOS

logo