ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 16:28:58

భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత... పలువురు అరెస్టు

భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత... పలువురు అరెస్టు

ఆదిలాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన ముజాఫర్‌ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి రూ. 70 వేల విలువ చేసే పత్తి విత్తనాలను ఆదిలాబాద్‌కు కారులో తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

అదేవిధంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌ వద్ద నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.10 లక్షల విలువైన 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ నుంచి భూపాలపల్లికి తరలిస్తుండగా సీసీఎస్‌ పోలీసులు రైడ్‌ చేసి పట్టుకున్నారు.


logo