మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 09, 2020 , 14:05:53

మాస్క్ లేకపోతే జరిమానా : నల్గొండ ఎస్పీ

మాస్క్ లేకపోతే జరిమానా : నల్గొండ ఎస్పీ

నల్లగొండ : కోవిడ్ - 19 నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించకపోతే జరిమానాలు తప్పవని ఎస్పీ ఏ.వి.రంగనాధ్ హెచ్చరించారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా   ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని, బయటికి వచ్చే సమయంలో విధిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాస్కులు ధరించకుండా బయటికి వచ్చే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని అన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మాస్కులు ధరించని 599 మందికి జరిమానాలు విధించామని వెల్డించారు. జిల్లాలోని  ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, బయటికి వస్తే మాస్క్ విధిగా ధరించాలని సూచించారు.

కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్న పోలీస్, వైద్య శాఖ, సానిటరీ సిబ్బందితో ప్రజలంతా సహకరించాలని కోరారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo