మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 08, 2020 , 14:09:09

మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య

మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య

సిరిసిల్ల రూరల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కి చెందిన ఓ వివాహిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..స్వర్గం సుజాత అనే మహిళకు 19 సంవత్సరాల క్రితం స్వర్గం గణేష్ అనే వ్యక్తితో వివాహమైంది. సుజాత గత సంవత్సరం క్రితం ఇందిరమ్మ కాలనీలో ఓ ఇల్లును నాలుగు లక్షలు అప్పు చేసి కొన్నది. కరోనా ఉన్న నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దుబాయ్‌లో ఉన్న తన భర్త గణేష్ డబ్బులు పంపక పోవడంతో అప్పులు ఎలా తీర్చేది అని మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలికి ఇద్దరు కూతుర్లు రేఖ,(16) సాహితి( 13), కొడుకు మణిదీప్ (10) ఉన్నారు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. ఎస్ఐ అభిలాష్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


logo