సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 10, 2020 , 16:08:13

జక్రాన్‌పల్లిలో వివాహిత హత్య

జక్రాన్‌పల్లిలో వివాహిత హత్య

ఇబ్రహీంపట్నం : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మునిపల్లి అటవీ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్‌కొత్తూరుకు చెందిన గుండ రజిత (33)గా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోజన్‌ కొత్తూరుకు చెందిన గుండ రజిత (33) వివాహం కాగా.. భర్తతో విడాకులు తీసుకొని ప్రస్తుతం పుట్టింటి వద్దనే ఉంటోంది. సెప్టెంబర్‌ 28న ఇంటి నుంచి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో అదే నెల 30న ఇబ్రహీంపట్నం పోలీసులకు తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు చేశాడు. 28న ఇంటి నుంచి వెళ్లిన ఆమె అదే రోజు మెట్‌పల్లిలోని గాయత్రి బ్యాంక్‌లో రూ.6వేలు విత్‌డ్రా చేసుకుంది.

అనంతరం మల్లాపూర్‌ మండలం శాతారానికి చెంది ఒడ్డె గంగాధర్‌ (33)తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. ఇద్దరికి ఫోన్‌లో పరిచయం ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. రజితను జక్రాన్‌పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి, ఒంటిపై మూడు తులాల బంగారం ఉండడంతో లాక్కునేందుకు యత్నించగా.. ఇవ్వకపోవడంతో హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. చనిపోయిన తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉంటాడని చెప్పారు. సదరు వివాహితకు మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పారు. కాగా, గంగాధర్‌.. రజితను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన దృశ్యాలు మెట్‌పల్లి బ్యాంక్‌ వద్ద, ఆర్మూర్ ఎక్స్‌రోడ్‌ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo