వివాహిత అనుమానాస్పద మృతి

కరీంనగర్ : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఓ వివాహిత ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అలకుంట గంగ జల(27)కు జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామానికి చెందిన బోదాసు గోపాల్‌తో తొమ్మిదేండ్ల క్రితం వివాహం జరిగింది. గోపాల్ మూడేండ్లు క్రితం అత్తగారి గ్రామమైన పైడిమడుగుకు వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరికి సాయికిరణ్, చరణ్ ఇద్దరు కుమారులున్నారు.
ఈ క్రమంలో గోపాల్ మద్యానికి బానిసై భార్యను వేధింపులకు గురి చేయడమేకాక, చిన్నారులను తరచూ కొట్టేవాడు. కాగా ఆదివారం భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. అదే రోజు అర్థరాత్రి గంగజల మృతి చెందింది. గంగజల అర్ధరాత్రి ఇంట్లో చీరతో ఉరి పెట్టుకుందని భర్త గోపాల్ ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
వారు గోపాల్ ఇంటికి వచ్చి చూడగానే మృతదేహం ఆరుబయట ఉంది. అక్కడి నుంచి భర్త గోపాల్ పారిపోయాడు. దీంతో గంగజలను భర్తే చంపాడంటూ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె తల్లి అలకుంట గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజప్రమీల తెలిపారు.
తాజావార్తలు
- శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్‌కు 2.5 ఏళ్ల జైలుశిక్ష
- వికారాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి
- నా గురించే ఆలోచిస్తున్నావా చైతూ: సమంత
- అలెక్సీ నవాల్నీని అరెస్టు చేసిన రష్యా
- తెలంగాణలో శబరిమల...ఎక్కడో తెలుసా...?
- బేగంపేటలో రోడ్డుప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌జామ్
- సిరాజ్‌కు 5 వికెట్లు.. టీమిండియా టార్గెట్ 328
- మెట్రోరైల్ ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ
- స్మిత్ ముందే రోహిత్ శర్మ కూడా అదే పని చేశాడా.. వీడియో
- దొరస్వామి మృతికి ఎన్టీఆర్ సంతాపం