మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 18:22:14

మాజీ ప్రియురాలి ఇంటిపై కాల్పులు.. వ్య‌క్తి అరెస్టు

మాజీ ప్రియురాలి ఇంటిపై కాల్పులు.. వ్య‌క్తి అరెస్టు

ఢిల్లీ : త‌న‌ను విస్మ‌రిస్తుండ‌టంపై ఆగ్ర‌హం చెందిన ఓ వ్య‌క్తి మాజీ ప్రియురాలి ఇంటిపై తుపాకీతో కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో గ‌డిచిన‌ ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 24 ఏళ్ల ఓ యువ‌తి, సుమిత్ తోమ‌ర్‌(27) అనే వ్య‌క్తి ఇరువురు గ‌త ప‌దేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు. కాగా సుమిత్ 2018లో వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అప్ప‌టి నుండి ప్రియురాలు సుమిత్‌ను దూరం పెట్ట‌డం ప్రారంభించింది. దీన్ని త‌ట్టుకోలేని వ్య‌క్తి గ‌డిచిన ఆదివారం రాత్రి యువ‌తి ఇంటికి వ‌చ్చి దేశ‌వాలీ తుపాకీతో ఇంటి గేటుపై కాల్పులు జ‌రిపాడు. 

కుటుంబ స‌భ్యుల‌తో ఉన్న యువ‌తి కాల్పుల శ‌బ్దం విని కిటికీలోంచి బ‌య‌ట‌కు చూసింది. యువ‌తిని బ‌య‌ట‌కు రావాల్సిందిగా బెదిరిస్తూ ఆమెను, ఆమె కుటుంబ స‌భ్యుల‌ను చంపేస్తాన‌ని అరుస్తూ అక్క‌డినుండి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు ఆలీ విహార్ అట‌వీప్రాంతంలో దాక్కున్న సుమిత్ తోమ‌ర్‌ను అరెస్టు చేశారు. తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. గ‌త నెల‌లో ఆగ్రాలో తుపాకీని కొనుగోలు చేసిన‌ట్లు విచార‌ణ‌లో తెలిపాడు. logo