మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 20:24:33

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి

అశ్వరావుపేట : ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నారంవారిగూడెంకు చెందిన గొర్ల చిట్టెమ్మ కుమార్తె అలివేలు మంగ (27) వాగు ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన గణప వెంకన్నతో పదేళ్ల కిందట వివాహం అయ్యింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్నేళ్ల కిందట మంగ భర్తతో విడిపోయి.. దమ్మపేట మండలం జలవాగు గ్రామానికి చెందిన పూనం శీనుతో సహజీవనం చేస్తూ జమ్మగూడెంలో నివసిస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారు జామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తెను శ్రీను హత్య చేసి ఉంటాడని మంగ తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు అయింది. పోస్టుమార్టం నిమిత్తం అలివేలు మంగ మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ మధు ప్రసాద్ తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo