e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home క్రైమ్‌ నిర్బంధం నుంచి 11 మందిని విడుదల చేసిన మావోయిస్టులు

నిర్బంధం నుంచి 11 మందిని విడుదల చేసిన మావోయిస్టులు

నిర్బంధం నుంచి 11 మందిని విడుదల చేసిన మావోయిస్టులు

రాయ్‌పూర్‌: తమ నిర్బంధంలో ఉన్న 11 మందిని మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. పోలీసులకు సహకరించవద్దని, అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వవద్దని వారిని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నట్లు అనుమానించిన మావోయిస్టులు కుండెడ్ గ్రామానికి చెందిన ఏడుగురిని ఈ నెల 18న అపహరించారు. వీరి విడుదల కోసం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు అడవిలోకి వెళ్లిన నలుగురిని కూడా నిర్బంధించారు. మరోవైపు 11 మందిని బంధించడంపై స్థానిక గిరిజన నేతలు, మీడియా నుంచి మావోయిస్టులపై ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 11 మందిని విడుదల చేశారని, వారు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారని బస్తర్‌ రేంజ్ ఐజీ సుందరాజ్ తెలిపారు. మావోయిస్టులు ఎందుకు కిడ్నాప్ చేశారన్నదానిపై 11 మంది నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తామన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిర్బంధం నుంచి 11 మందిని విడుదల చేసిన మావోయిస్టులు
నిర్బంధం నుంచి 11 మందిని విడుదల చేసిన మావోయిస్టులు
నిర్బంధం నుంచి 11 మందిని విడుదల చేసిన మావోయిస్టులు

ట్రెండింగ్‌

Advertisement